More

    Choose Your Language

    మానవత్వం

    సత్సంబంధాలు కలిగి ఉండండి	దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

“విచ్చిన్నమైన సంబంధాలు కలిగి ఉండకండి, శత్రుత్వం వహించకండి ఒకరికొకరు సోదరులుగా, దైవ దాసులుగా ఉండండి. " 
సహీహ్ ముస్లిం #2563b
    కృతజ్ఞతలు తెలుపడం మరువకండి	

దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

“ప్రజలకు కృతజ్ఞతలు తెలుపని వాడు దైవానికి కూడా కృతజ్ఞత తెలుపడు.”  	
అబూ దావూద్ #4811
    మంచిగా వ్యవహరించండి	దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

“ఎవరైతే స్వర్గాన్ని పొందాలని కోరుకుంటున్నారో వారు - ఇతరులు వారితో ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో వారు కూడా ఇతరులతో అలానే వ్యవహరించాలి.”	సహీహ్ ముస్లిం #1844
    ప్రేమను పంచండి, విద్వేషాన్ని కాదు	దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

“మీరు మీ కోసం దేనినైతే కోరుకుంటారో అదే ఇతరుల కోసం కూడా కోరుకోండి, అప్పుడు మీరు నిజ విశ్వాసులు అవుతారు. మీ పొరుగువారితో మంచిగా వ్యవహరించండి, అప్పుడు మీరు దైవ చిత్తానికి తలవంచేవారు(దైవ దాసులు) అవుతారు.”  
సునన్ ఇబ్న్ మాజా # 4217
    విశ్వ కారుణ్యమూర్తి	దైవ ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై శాంతి కలుగు గాక) ఇలా అన్నారు: 

“నేను ఎవరినీ శపించడానికి, దూషించడానికీ పంపబడలేదు, (సర్వ మానవాళికి) కారుణ్యంగా చేసి పంపబడ్డాను.”  	సహీహ్ ముస్లిం #2599
    అంతర్జాతీయ ఆఫ్రికా సంతతి దినోత్సవం	"మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి."	ఖుర్ఆన్ 30:22
    WHAT OTHERS ARE READING

    Most Popular