చాలా మంది అల్లాహ్ అంటే కేవలం ముస్లిముల దేవుడు అనుకుంటారు. హిందువులు వారి ఇష్ట దైవాలను, క్రైస్తవులు యేసుక్రీస్తుని ఎలా పూజిస్తారో ముస్లిములు కూడా అల్లాహ్ ని పూజిస్తారని అనుకుంటారు.
‘అల్లాహ్’ అంటే ‘దేవుడు’ అని అర్ధం
దేవుడు అనే పదానికి వివిధ భాషలలో వివిధ పదాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు:
హిందీ భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘ఈశ్వర్’
కన్నడ భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘దేవరు’
మలయాళం భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘దైవం’
ఇంగ్లీషు భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘గాడ్’
అలాగే అరబీ భాషలో దేవుడు అనడానికి ఉన్న పదం ‘అల్లాహ్’
గూగుల్ ట్రాన్స్ లేట్ (నిఘంటువు)

గాడ్ (దేవుడు) అనే పదానికి అరబీ భాషలో సమాన పదం ‘అల్లాహ్’ అని గూగుల్ ట్రాన్స్ లేట్ లో కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా అల్లాహ్ అంటే కేవలం దేవుడు అని అర్ధం, అంతేగాని అల్లాహ్ అంటే కేవలం ముస్లిముల యొక్క దేవుడు అని అర్ధం కాదని స్పష్టమవుతుంది.
పదాలు అనేకం కాని అస్తిత్వం ఒకటే
నీళ్లను హిందీలో ‘పానీ’ అని, కన్నడలో ‘నీరు’ అని, మలయాళంలో ‘వెల్లం’ అని, అరబీలో ‘మోయా’ అని అంటారు. ఈ పదాలన్నీ కూడా నీళ్లు అనే ఒకే అస్తిత్వాన్ని ఎలా సూచిస్తున్నాయో అలాగే దేవుడు అనడానికి వివిధ భాషలలో ఉన్నా పదాలన్నీ కూడా ఒకే అస్తిత్వాన్ని సూచిస్తున్నాయి.
సారాంశం
ముస్లిములు ‘అల్లాహ్’ అన్నప్పుడు, వారు వారి సొంత దేవుడిని ప్రస్తావించడం లేదు, వారు ప్రస్తావిస్తున్నది మనందరి సృష్టికర్త, విశ్వ సృష్టికర్త అయిన ఒకే ఒక దేవుడిని.