సోక్రటీస్
మా గురించి
సోక్రటీస్
మానవాళిని ప్రభావితం చేసే పలు అంశాలపై మీ ప్రశ్నలకు, సందేహాలకు సంబంధించి ప్రామాణికమైన, తార్కికమైన సమాచారాన్ని అందజేసే వేదికే Curious Hats.
అన్వేషించండి, అభ్యసించండి, అర్ధం చేసుకోండి. ఈ మూడు సుగుణాలే మా వేదికకు ఆధారాలు. సాటి దేశవాసులందరిలోనూ ప్రామాణికమైన జ్ఞానాన్ని సంపాదించే ఉత్సాహాన్ని ప్రేరేపించడమే మా లక్ష్యం.
విభిన్న సిద్ధాంతాలను అనుసరించే వారి మధ్య ఆలోచనల మరియు అభిప్రాయాల సంవాదం సమాజంలో శాంతి, సదవగాహన మరియు సామరస్యాలకు మూలం అని మా అభిప్రాయం.
ఇక్కడ మీకింతవరకు తెలిసి ఉండని భావనలు, సమాచారం మరియు మీరింతకు ముందు ఊహించి ఉండని దృష్టికోణాలు మీ ముందుకు వస్తాయి. మీరు వీటన్నింటితో అంగీకరించవలసిన అవసరం లేదు కానీ మీరు మా అభిప్రాయాలను, మా దృష్టికోణాన్ని అభినందిస్తారని ఆశిస్తున్నాము.
తమసోమా జ్యోతిర్గమయా...
నన్ను (అసత్యం యొక్క) అంధకారం నుండి (సత్యం యొక్క) వెలుగు వైపుకు తీసుకుపో!
అసత్యం అనేది అంధకారం వంటిది. సత్యం అనేది వెలుగు వంటిది. అంధకారంలో మనకేదీ కనిపించదు, వాస్తవం అనేది బోధపడదు. దానిని తెలుసుకోవడానికి మనకు సత్యం అనే వెలుగు కావాలి. అందుకని మేము సత్యమైన, ప్రామాణికమైన సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రక్రియలో ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నాము.
ప్రామాణిక, సత్యాధారిత సమాచారాన్ని మాత్రమే మీకు సమర్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఖురాను గ్రంధం 39వ అధ్యాయం, 9వ వాక్యం.