More

    Choose Your Language

    ఒక దేవుడా? అనేక మంది దేవుళ్లా?

    అనేక మంది దేవుళ్లు ఉండి ఉంటే, వారి మధ్య ఉండే విభేదాల వలన ఈ విశ్వం ఉనికిలోకి వచ్చేదే కాదు. ఈ విశ్వం యొక్క అస్తిత్వం మరియు అందులో ఉన్న క్రమబద్ధత, సమతాళము మరియు నిర్దిష్టమైన గణిత సూత్రాలు ఈ విశ్వం వెనుక ఒకే ఒక మహా మేధావి అయిన సృష్టికర్త హస్తం ఉందని, అతడే ఈ విశ్వం యొక్క సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి.

    ఒక దేవుడా? అనేక మంది దేవుళ్లా? దీనికి సమాధానం – “దేవుడు ఒకే ఒక్కడు”. ఇది ఎలాగని మీరు ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండి..

    ఒకవేళ ఇద్దరు దేవుళ్లు ఉండి ఉంటే..

    బహు దైవ వాదం యొక్క ఒక సులభమైన ఉదాహరణను తీసుకుందాం… ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని అనుకుందాం.. ఏదైనా విషయం గురించి వీరిద్దరూ ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తే, ఈ క్రింది సందర్భాలు ఎదురవుతాయి

    సందర్భం 1 – ఇద్దరు దేవుళ్లు ఎల్లప్పుడూ విభేదిస్తారు

    ఒక విషయం గురించి ఇద్దరు దేవుళ్లు విభేదిస్తే అప్పుడు ఆ పని ఎప్పటికీ జరగదు

    Polytheism or Monotheism?

    ఈ విశ్వ సృష్టి గురించి దేవుళ్ల మధ్య అభిప్రాయ బేధాలు ఉండి ఉంటే, అసలు ఈ విశ్వం ఉనికిలోకే వచ్చేది కాదు. మనకు జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న విషయాల వలన కూడా పెద్ద గందరగోళం జరిగి ఉండేది.

    ఉదాహరణకు ఒక హిందువు మరియు క్రైస్తవుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుందాము. వారిలో ఒకరికి మాత్రమే ఆ ఉద్యోగం దొరకగలదు. వారిద్దరూ ఆ ఉద్యోగం కోసం వారి వారి దేవుళ్లను ప్రార్థిస్తారు. ఒకవేళ ఆ హిందువుకి, క్రైస్తవుడికి వేరు వేరు దేవుళ్లు ఉండి ఉంటే అప్పుడు వారిలో ఎవరు ఆ ఉద్యోగాన్ని, ఎవరికి ఇస్తారు? ఒకవేళ హిందూ దేవుడు హిందువుకు, క్రైస్తవ దేవుడు క్రైస్తవునికి ఆ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయిస్తే, దేవుళ్ల మధ్య ఆ అభిప్రాయ బేధం వలన వారిలో ఎవరికీ ఆ ఉద్యోగం రాదు.

    ఈ ప్రపంచంలో, వివిధ దేవుళ్లను నమ్ముకునే వారు అనుక్షణం కోటాను కోట్ల ప్రార్ధనలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అనేక మంది దేవుళ్లు ఉండి ఉంటే, వారి మధ్య ఉండే భిన్నాభిప్రాయాల వలన ఈ సృష్టి మొత్తం అస్తవ్యస్తం అయి, నాశనం అయిపోయేది.

    ఖురాను గ్రంధంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు:

    ..వాటిలో (భూమ్యాకాశాలలో) దేవుడు తప్ప ఇతర ఆరాధ్య అస్తిత్వాలు ఉంటే అవి రెండూ (భూమ్యాకాశాలు) నాశనమైపోయేవే కదా! కావున విశ్వ సామ్రాజ్య సింహాసనానికి ప్రభువైన దేవుడు! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.

    [21వ అధ్యాయం : 22వ వాక్యం]

    సందర్భం 2 – ఇద్దరు దేవుళ్లు ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉంటారు

    ఇద్దరు దేవుళ్లు ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉంటే మనకు ఇద్దరు దేవుళ్లు ఎందుకు? ఉదాహరణకు ఒక పాఠశాలకు ఇద్దరు ప్రధానోపాధ్యాయులు ఉండి, వారిద్దరూ ఎల్లప్పుడూ ఒకే నిర్ణయం తీసుకుంటూ ఉంటే.. అసలు ఆ పాఠశాలకు ఇద్దరు ప్రధానోపాధ్యాయులు ఎందుకు? ఒకరే ఉంటే సరిపోతుంది కదా?

    ఈ విశ్వంలో జరుగుతున్న అనంత కోటి సంఘటనలకు దీనిని ఆపాదిస్తే, అనేక మంది దేవుళ్లు ఎటువంటి భిన్నాభిప్రాయాలు, గొడవలు లేకుండా అన్ని విషయాల గురించి ఒకే అభిప్రాయంతో ఉండడం అనేది సాధ్యం కాని విషయం, కానీ ఒకవేళ అలా ఉన్నా అప్పుడు అంత మంది దేవుళ్లు ఉండడం అనేది దండగే (అనవసరమే) కదా?

    సందర్భం 3 – ఇద్దరు దేవుళ్లు విభేదిస్తారు మరియు వారిలో ఒక దేవుడు మరొక దేవుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు

    ఒకవేళ మొదటి దేవుడు రెండవ దేవుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటే, రెండవ దేవుడే ప్రాబల్యం గల మరియు అధిక శక్తిమంతుడైన దేవుడు అని అర్ధం అవుతుంది. అప్పుడు మొదటి దేవుడు రెండవ దేవుడికి విధేయతతో ఉంటాడు. మనం ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే మొదటి దేవుడు రెండవ దేవుడితో సమానుడు కాడని, అసలు మొదటి దేవుడు దేవుడు అనే నిర్వచనానికే సరి తూగడని అర్ధం అవుతుంది.

    మనం దీనిని అనేక దేవుళ్లకు ఆపాదిస్తే, అందరు దేవుళ్లు ఒకే ఒక దేవుడికి విధేయులై ఉంటారని, అతడి నిర్ణయాలకు కట్టుబడి ఉంటారని అర్ధం అవుతుంది. అప్పుడు ఆ దేవుళ్లందరూ వాస్తవానికి దేవుళ్లే కారు ఎందుకంటే వారు మరొక సర్వోన్నత దైవానికి పరాధీనులై ఉన్నారు.

    ఖురాను గ్రంధంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు:

    ఎందుకంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని (దేవుని) దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు.

    [19వ అధ్యాయం : 93వ వాక్యం]

    సారాంశం

    ఈ విశ్వం యొక్క అస్తిత్వం మరియు అందులో ఉన్న క్రమబద్ధత, సమతాళము మరియు నిర్దిష్టమైన గణిత సూత్రాలు ఈ విశ్వం వెనుక ఒకే ఒక మహా మేధావి అయిన సృష్టికర్త హస్తం ఉందని, అతడే ఈ విశ్వం యొక్క సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడని నిస్సందేహంగా నిరూపిస్తున్నాయి.

    ఖురాను గ్రంధంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు:

    మరియు మీ ఆరాధ్యదైవం కేవలం ఆ అద్వితీయుడైన దేవుడు మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యుడు లేడు, అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత.

    [2వ అధ్యాయం : 163వ వాక్యం]

    మీకు ఆసక్తి కలిగించే ఇతర వ్యాసాలు

    WHAT OTHERS ARE READING

    Most Popular