ఈ లోకంలో అందరూ ఏకగ్రీవంగా అంగీకరించే విషయం ఏదైనా ఉంది అంటే అది..మరణం. మనమందరము మరణిస్తాము. మరణం అంటే ఏమిటి? కేవలం జీవితం అంతం కావడమా? మరణంతో సమస్తమూ అంతం అవుతుందా? మరణంతో సమస్తం అంతం అయితే, చాలా విషయాలకు జవాబు ఉండదు. 1)న్యాయం – సంపూర్ణ న్యాయం అనేది ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. 2)తీరని కోరికలు – చాలా మంది చిన్న వయసులో అకస్మికంగా మరణిస్తూ ఉన్నారు 3) అదృష్టం – కొందరు ధనిక కుటుంబాలలో పుట్టి అన్ని భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు, మరి కొందరు నిరుపేదల ఇళ్ళలో పుట్టి బాధలను, కష్టాలను అనుభవిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే, మరణంతో సమస్తమూ అంతం అవుతుంటే మరి న్యాయం జరిగేదెక్కడ? కోరికలు తీరేవెక్కడ? అదృష్టం వలన కష్టాలు అనుభవించిన వారు సుఖపడేదెక్కడ?
ఈ విశ్వ నిర్మాణంలో మనకు కనిపించే కూర్పు, క్రమం, సృజనాత్మకతలను గమనిస్తే, విశ్వాన్ని ఇంత పొందికగా తీర్చి దిద్దినవాడు ఇక్కడ అన్యాయాన్ని, అసంపూర్తిని అనుమతిస్తాడని బుద్ధి ఉన్న వారికైతే అనిపించదు.
మరి అయితే, మరణం తరువాత కూడా ఇంకా జీవితం ఉందా? పునర్జననం సంభవమా? తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.