More

    Choose Your Language

    కాఫిర్ అంటూ ఖురాన్ హిందువులను దూషిస్తుందా?

    కాఫిర్ అనేది అవమానకరమైన పదమా? కాదు. “ముస్లిం” అనే పదానికి వ్యతిరేక పదం “కాఫిర్”. వ్యతిరేక అర్ధాలు, పదాలు ప్రతీ మతంలోనూ వాడబడ్డాయి. పరదేశస్థులను, వైదికులు కాని వారిని హిందూ మతంలో “మ్లేచ్ఛులు” అని పిలవబడింది

    కాఫిర్ అంటూ ఖురాన్ హిందువులను దూషిస్తుందనే అపోహ చాలా మందిలో ఉంది. రండి, దీనిని పరిశీలిద్దాము. 

    “కాఫిర్” అనేది “ముస్లిం” అనే పదానికి వ్యతిరేక పదం.

    ప్రతీ పదానికి వ్యతిరేక అర్ధం వచ్చే పదాలు ఉంటాయని, వాటిని వ్యతిరేక పదాలు అంటారని మనకు తెలుసు. ఉదాహరణకు – మంచి-చెడు; కుడి-ఎడమ;నాగరిక-అనాగరిక మొదలైనవి. ఇదేవిధంగా, “ముస్లిం” అనే పదానికి వ్యతిరేక పదం “కాఫిర్”. ముందుగా, ఈ రెండు పదాల యొక్క అర్ధాన్ని తెలుసుకుందాం.

    ముస్లిం , కాఫిర్ – ఈ పదాలకు అర్ధం ఏమిటి?

    ముస్లిం అంటే క్రింది విషయాలను నమ్మేవాడు

    1. దేవుడు ఒక్కడే

    2. దేవుడికి ఎవరి లేదా దేని అవసరం కూడా ఉండదు

    3. దేవుడికి భార్యా పిల్లలు ఉండరు

    4. దేవుడు మనుషుల మధ్య (పుట్టుక, జాతి, కులం మొదలైన వాటి ఆధారంగా) బేధ భావం కలిగి ఉండడు

    5. దేవుడికి ఎటువంటి బలహీనతలు (మతిమరుపు, కునుకు రావడం, అనారోగ్యం పాలు కావడం లాంటివి) ఉండవు.

    6. దేవుడికి సమానమైనది ఏదీ లేదు

    7. మరణానంతర జీవితం ఉంది. అందులో దేవుడు మన కర్మలను బట్టి తీర్పు చేస్తాడు. మంచివారు స్వర్గానికి వెళ్తారు, దుష్టులు నరకానికి వెళ్తారు.

    8. ప్రవక్తలు సత్పురుషులు, మానవాళికి ఆదర్శంగా ఉండడానికి పంపబడ్డారు.

    కాఫిర్ అంటే తిట్టు కాదు 

    వ్యతిరేక అర్ధాలు, పదాలు ప్రతీ మతంలోనూ వాడబడ్డాయి . పరదేశస్థులను, వైదికులు కాని వారిని హిందూ మతంలో “మ్లేచ్ఛులు” అని పిలవబడింది. క్రైస్తవ, యూద మతాలలో ఇస్రాయీలు వంశానికి చెందని వారిని “జెంటైల్స్” అంటారు.

    హిందీ భాషలో మనం పరదేశస్థులను “ఫిరంగీలు” అంటాము. పరదేశస్థుల నమోదు కార్యాలయాలు ప్రతీ నగరంలోనూ ఉంటాయి. మన దేశాన్ని సందర్శిస్తున్న ఒక అమెరికా లేదా జర్మనీ పౌరుడు “నువ్వు ఒక పరదేశస్థుడవు” అంటే దానిని అతడు దూషణగా భావిస్తాడా? కాదు కదా, అలాగే “కాఫిర్” అనే పదం కూడా ముస్లిమేతరులను సూచిస్తుంది తప్ప అది వారిని దూషించడం కాదు. 

    ఖురానులో (హిందువులతో సహా) మానవులందరూ గౌరవించబడ్డారు

    ఖురానులో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు… 

    మరియు వాస్తవానికి మేము ఆదమ్‌ సంతతికి గౌరవము నొసంగాము… 

    ఖురాను 17:70

    సర్వ మానవాళి ఆదము సంతానమని, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని ఇస్లాం బోధిస్తుంది. సర్వ మానవాళి దేవుడిచే గౌరవించబడింది – ఇందులో ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. మరి అలాంటప్పుడు హిందువులను దూషించడం జరిగిందని ఎలా అనగలం?

    ఒక ముస్లిము కూడా కాఫిర్ కావచ్చు

    ముస్లిం, కాఫిర్ అనే రెండు పదాలు కూడా ఒక వ్యక్తి విశ్వాసాలకు, వారు చేసే పనులకు సంబంధించినవి. అందుకని వాటిని కేవలం వ్యక్తులకు మాత్రమే ఉపయోగించగలం, ఒక సమూహం మొత్తానికి కాదు. దేవుడిని విశ్వసించి, దైవాజ్ఞలను ఆచరించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ముస్లిము అవుతాడే తప్ప కేవలం ముస్లిము కుటుంబంలో పుట్టి లేదా సుల్తాన్, షేక్ లాంటి ముస్లిం పేర్లు ఉన్నంత మాత్రాన కాదు. ఒక వ్యక్తికి ముస్లిం పేరు ఉండవచ్చు కానీ దేవుడిని విశ్వసించని కారణంగా అతడు కాఫిర్ అయి ఉండవచ్చు. 

    ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారు – “నమాజును (ప్రార్ధనలను) ఇష్టపూర్వకంగా వదిలివేసిన వ్యక్తి ఒక కాఫిర్”

    గమనిస్తే, ఇది ముస్లిములను ఉద్దేశించి అనబడుతుంది. 

    దీని వలన తెలిసేదేమిటంటే కాఫిర్ అనే పదం కేవలం ముస్లిమేతరుల కొరకో లేదా హిందువుల కొరకో ఉద్దేశించినది కాదు మరియు ఇది ఎవరినీ దూషించడానికి ఉద్దేశించినది కూడా కాదు.

    WHAT OTHERS ARE READING

    Most Popular