మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి
ఖుర్ఆన్ 2:195
సిగరెట్లు అశుద్ధం, ఇదిగో ఆధారం
టాయిలెట్ లో మల విసర్జన చేస్తూ ఎవరైనా వారికి పసందయిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారా? కనీసం నీళ్ళయినా తాగడానికి ఇష్టపడతారా?
మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వారెవరూ ఆ పని చేయరు ఎందుకంటే ఆహారం శుద్ధమైనది, దానిని అశుద్ధ వాతవరణంలో భుజించకూడదు.
అయితే టాయిలెట్లో ధూమపానం చేసేవారు ఉంటారు. దీనివలన ధూమపానం అనేది అశుద్ధమైనదని తెలుస్తుంది.
పొగత్రాగినప్పుడు మీ ఊపిరితిత్తులకు ఏమి జరుగుతుందో తెలుసుకోండి
పొగ త్రాగేవారు వారిని, వారి ప్రక్కన ఉన్న వారిని కూడా చంపుకుంటున్నారు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, ధూమపానంతో ఏటా 82 లక్షల మంది చనిపోతున్నారు. వారిలో దాదాపు 70 లక్షల మంది ప్రత్యక్షంగా ధూమపానం చేసే వారయితే, మిగతా 12 లక్షల మంది పరోక్షంగా ఆ పొగ వలన అనారోగ్యం పాలయి చనిపోతున్నారు.
పొగ త్రాగేవారు పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నారు
ధూమపానం ఎందుకు చేయాలి? ఈ దురలవాటును వదులుకోవడానికి ఈ రోజే నిర్ణయం తీసుకోండి. మనసుంటే మార్గం ఉంటుంది, దైవ సహాయం కూడా లభిస్తుంది.