ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అని, అందుకని వారి జనాభా పెరుగుతూ పోయి చివరకు మనదేశం ముస్లిం దేశంగా మారిపోనుందని చాలామంది భయపడుతున్నారు., అయితే, అసలు నిజం ఏమిటి?
- 2011 లో నిర్వహించిన ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం, ముస్లిం జనాభా పెరుగుదల 2011 లో 20 సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది, ఇది 1991 లో 32.8% నుండి 2011 లో 24.6% కి పడిపోయింది.
- భారతీయ ముస్లిం మహిళల సంతాన సాఫల్య రేటు 1991లో 4.1 నుంచి 2011లో 3.4 కి పడిపోయింది.
- హిందువుల మరియు ముస్లింల దశాబ్ధ జనాభా పెరుగుదల రేట్లు (10 సంవత్సరాల వృద్ధి రేట్లు) తగ్గుతున్నాయి.
1991 | 2001 | 2011 | |
హిందువులు | 22.7% | 19.9% | 16.7% |
ముస్లింలు | 32.8% | 29.5% | 24.6% |
ముస్లింల సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది అని NFHS డేటా వెల్లడిస్తుంది
2015-16 లో నిర్వహించిన 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) మరియు 2019-21 లో నిర్వహించిన 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) ఆధారంగా, ఒక మహిళ ఆమె జీవితకాలంలో కనే పిల్లల సగటు రేటు మొత్తం సంతాన సాఫల్య రేటు కన్నా తగ్గడం అన్ని మతాలలో చూడవచ్చు. ముస్లిం మహిళల సంతాన సాఫల్య రేటు గణనీయంగా 2.62 నుండి 2.36కి తగ్గింది.

2050 లో – ముస్లింలు 18.4% & హిందువులు 76.7% ఉంటారు
PEW నివేదిక ప్రకారం, జనాభా గణాంకాలను పరిశీలిస్తే, 2050 నాటికి, ముస్లింలు 18.4% మరియు హిందువులు 76.7% ఉంటారు.

ముస్లింల జననాల రేటు తగ్గుతోంది మరియు కనీసం వచ్చే 300 సంవత్సరాల వరకు ముస్లింలు హిందువులను అధిగమించే అవకాశం లేదు అని గణాంకాల నుండి మనం స్పష్టంగా చూడవచ్చు. ముస్లింలు తమ జనన రేటు కారణంగా భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చడం కేవలం ఒక అపోహ మాత్రమే అని మీకు ఇప్పుడైనా స్పష్టంగా అర్ధం అయి ఉండాలి!