More

  Choose Your Language

  విద్వేషం-వినాశనం. విద్వేషం కలిగించే శారీరక, మానసిక సమస్యలు

  మనం ఎవరినైనా ద్వేషిస్తే, మెదడు దానిని ఒక హానికారకమైన ఆపదలా పరిగణిస్తుంది. వెంటనే అది శరీరంలోని అన్ని అవయవాలకు కొన్ని రసాయనాలను విడుదల చేసి పంపిస్తుంది. ద్వేష భావనలు తరచుగా సంభవిస్తే, ఈ రసాయనాలు తరచుగా ఉత్పత్తి అవడం జరిగి మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్ లాంటి అనేక పెద్ద రోగాలకు దారి తీస్తుంది.

  ఈ మధ్య కాలంలో రాజకీయ, మతపరమైన విద్వేష ప్రచారం జోరుగా సాగుతుంది. కొన్ని శక్తులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం విద్వేషాన్ని సర్వ సాధారణం చేయాలని చూస్తున్నాయి. దురదృష్టవశాత్తూ, ఈ విద్వేష ప్రచారానికి జవాబు కూడా ఎక్కువగా విద్వేషంతోనే ఇవ్వబడుతుంది, దీని వలన సమాజంలో మరింత విద్వేషం ప్రబలుతుంది. యువకులు, పిల్లలు కూడా ఈ విద్వేష ధోరణిలోకి లాగివేయబడుతుండడం విచార దాయకంగా ఉంది.

  విద్వేషాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు ఎందుకంటే ఇది సమాజంలో అశాంతిని రేకిత్తించడమే కాక, దానిని తమ మనో మస్తిస్కాలలో పెంచి పోషించేవారికి శారీరకంగా కూడా అత్యంత నష్టదాయకంగా పరిణమిస్తుంది.

  విద్వేషం వలన కేన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ – డాక్టర్ B.M. హెగ్డే

  విద్వేషం వలన తలెత్తే శారీరక, మానసిక సమస్యలు

  విద్వేషం అనేది ఒక మనిషి పై ఎటువంటి శారీరక, మానసిక ప్రభావం చూపుతుంది అనే కోణంలో చాలా పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలలో తెలిసిందేమిటంటే, విద్వేషం అనేది శారీరక అవయవాల మీద ప్రభావం చూపే ముందు అది మెదడుని ప్రభావితం చేస్తుంది. 

  మనం ఎవరినైనా ద్వేషిస్తే, మెదడు దానిని ఒక హానికారకమైన ఆపదలా పరిగణిస్తుంది. వెంటనే అది శరీరంలోని అన్ని అవయవాలకు కొన్ని రసాయనాలను విడుదల చేసి పంపిస్తుంది. అవి కార్టిసోల్, ఎడ్రినలిన్, నోరా ఎడ్రినలిన్ మొదలైనవి. ఇవి ఒత్తిడిని నియంత్రించే హార్మోన్లు. ఇవి మన శరీరాన్ని ఆత్మ రక్షణ లేదా దాడికి సిద్ధం చేసి దానిని అతిగా స్పందించడానికి పురికొల్పుతాయి. ద్వేష భావనలు తరచుగా సంభవిస్తే, ఈ రసాయనాలు తరచుగా ఉత్పత్తి అవడం జరిగి ఎడ్రినల్ గ్రంధులు బలహీన పడడం జరుగుతుంది. దీనివలన బరువు పెరగడం, నిద్రలేమి, అందోళణ, డిప్రెషన్ మొదలైన తాత్కాలికమైన లక్షణాలు సంభవిస్తాయి. కాలక్రమంలో నాడీమండల, వ్యాధి నిరోధక మరియు అంతశ్రావ వ్యవస్థలపై ఒత్తిడి పెరిగి ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్ లాంటి అనేక పెద్ద రోగాలకు దారి తీస్తుంది.

  విద్వేషం మరియు మనస్తత్వ

  విద్వేషం అనేది ఒక వ్యసనం లాంటింది. దానికి ఎక్కువగా చోటిస్తే దానికి బానిసలా మారడం జరుగుతుంది. కొత్త విద్వేషం లోపల అప్పటికే ఉన్న విద్వేషాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ఇది ఒక చట్రంలా కొనసాగి విద్వేషంతో నిండి ఉన్న వ్యక్తి ఆరోగ్యంపై తక్కువ కాలంలోనే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇతర వ్యసనాలు,దురలవాట్ల వలే దీనిని మానుకోవడం కూడా కష్టం అవుతుంది. ఆ వ్యక్తి ఒక ధృడ సంకల్పంతో ప్రయత్నం చేస్తే తప్ప.

  విద్వేషం నుండి రక్షించుకోవడం ఎలా?

  1. విద్వేషం మరియు విద్వేష ప్రచారాల గురించి అవగాహన కలిగి ఉండాలి. వాటిని చూసిన వెంటనే గుర్తించగలగాలి. ఉదాహరణకు సామాజిక మాధ్యమాలలో ఒక వర్గం వారికి వ్యతిరేకంగా వచ్చే సందేశాలు.
  2.  అపార్థాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకే వైపు వాదనలు వినకుండా, నిందించబడుతున్న వారు ఏమి చెపుతున్నారో కూడా గమనించాలి. విద్వేష ప్రచారం అయితే వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి (ఫ్యాక్ట్ చెక్). మనలో ఉండే పక్షపాత ధోరణి, మూసపోత ధోరణులను మార్చుకోవాలి. 
  3. విద్వేషానికి కారణాలు గుర్తించాలి. ఎదుటి వారిని అపార్థం చేసుకోవడం, దుష్ప్రచారాలను నమ్మడం, పక్షపాత ధోరణిలో ఆలోచించడం, మూసపోత ధోరణి (స్టీరియో టైప్ చేయడం) అంటే ఉదాహరణకు ఒక వర్గం వారు అందరూ దొంగలే అనడం.
  4. మంచి విషయాలపై దృష్టి పెట్టండి. ప్రతీ వ్యక్తి, సమాజం లేదా సందర్భంలో మంచి అనేది తప్పకుండా ఉంటుంది.
  5. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే పనులు చేస్తూ ఉండండి. ఉదాహరణకు మంచి పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, దాన ధర్మాలు చేయడం మొదలైనవి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు దోహదం చేసే శ్వాస సంబంధ వ్యాయామాలు. వీటి వలన శారీరక-మానసిక సమతౌల్యాన్ని సాధించవచ్చు. తద్వారా విద్వేషం కలిగించే నష్టాల నుండి రక్షించుకోవచ్చు.

  మీకు ఆసక్తి కలిగించే ఇతర వ్యాసాలు

  WHAT OTHERS ARE READING

  Most Popular